గుంతకల్లు పట్టణంలోని 3, 14, 15 వార్డులలోని మిల్లు ఏరియా, రాజేంద్ర నగర్, పాత గుత్తి రోడ్డు ప్రాంతాలలో పారిశుధ్య కార్మికుల చేస్తున్న పను లను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సోమవారం పరిశీలించారు. రాజేంద్ర నగర్లో మురికి కాలువలో పూడిక నిండిపోయి మురుగు నీరు రోడ్డుపైకి రావడంతో కాలువలు శుభ్రం చేయించాలని సచివాలయం శానిటరీ కార్యదర్శిని ఆదేశించారు. ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా అమలు చేయాలని సూచించారు. ఆయనతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.