రాష్ట్రంలో రోడ్ షోలు, ర్యాలీల పై ఆంక్షలు విధిస్తూ తెచ్చిన జీవో నెంబర్ 1 ని తక్షణం రద్దు చేయాలని పర్చూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆ మేరకు ధరించిన ప్లకార్డులతో సోమవారం ఆయన సహ శాసనసభ్యులతో కలిసి అమరావతిలో అసెంబ్లీ ఎదుట ప్రదర్శన చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకే ఈ జీవోను తెచ్చారని ఏలూరి ధ్వజమెత్తారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను వెలుగెత్తి చాటుతున్న తెలుగుదేశం పార్టీని నిలువరించడం కోసం ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందన్నారు.