జగనన్న విద్యా దీవెన పథకం పేదవిద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు వరం లాంటిదని ఎటిడబ్ల్యుఒ డి. అమర సుబ్బయ్య తెలిపారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో సోమవారం సమావేశం నిర్వహించారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో 4, 979 మంది తల్లుల ఖాతాల్లోకి రూ. 3, 70, 93, 891 జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ డబ్ల్యులు లక్ష్మయ్య, శ్రీనివాసరావు, ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.