కొరిశపాడు మండలం కొరిశపాడు లోని గృహ నిర్మాణ శాఖ అధికారుల తీరు యధా రాజా తథా ప్రభ అనుచందంగా మారింది. కనీసం సోమవారం రోజున కూడా ఉదయం 10 దాటిన కార్యాలయం తాళాలు కూడా తీయలేదు. రెవెన్యూ, మండల పరిషత్, ఉపాధి, విద్య, అంగన్వాడి, వెలుగు అధికారులు సమయానికి హాజరైనప్పటికీ ఒక గృహ నిర్మాణ శాఖ అధికారులు మాత్రమే సమయానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గృహ నిర్మాణ శాఖ ఏఈ కే సమయపాలన లేకపోతే సిబ్బంది ఎలా పాటిస్తారనే విమర్శలు బహిరంగంగానే వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుచున్నారు.