రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారీ వృక్షాలు ఆదివారం నేలకొరిగాయి. దీంతో కళాశాలలో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఆ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని గదుల్లో సరైన వెలుతర ఉండదు. విద్యుత్ సరఫరా లేకుంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ ప్రభావం మార్కుల పై కూడా పడే అవకాశం ఉంటుంది. దీనికి తోడు సీ సీ కెమెరాలు కూడా పని చేయవు. అందువల్ల సంభదిత అధికారులు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని యుద్ద ప్రాతిక పదిన విద్యుత్ సరఫరా ను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.