వేంపల్లి మండలంలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో చాలాచోట్ల భారీ వృక్షాలు, కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం విద్యుత్ శాఖ ఎస్ ఈ ఆదేశాలు మేరకు డీఈలు రమేష్ రెడ్డి, శ్రీకాంత్ , ఏఈ చంద్ర, విద్యుత్ సిబ్బంది కలిసి హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. వ్యవసాయ రైతులకు సంబంధించి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కూడా నేలమట్టమయ్యాయి. త్వరలోనే వీటి సమస్య పరిష్కారం చేస్తామని వారు తెలిపారు.