ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని జడ్పీ చైర్మన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. సిద్దవటం మండలం వంతాటిపల్లికి చెందిన శ్రీనివాసులు యాదవ్ గతంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. 20, 000 వేల రూపాయలు తన సొంత నిధులు ఇచ్చి అంత్యక్రియలకు అందజేశారు. ప్రభుత్వం ద్వారా 5, 00, 000 రూపాయలు ఇప్పించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. కృష్ణ లాడ్జి ఓనర్ శ్రీనివాసులు యాదవ్, జె కృష్ణ రావ్ యాదవ్, ఎం. వెంకటరత్నం యాదవ్, తాళ్లూరి సుబ్రహ్మణ్యం యాదవ్ (కువైట్), బ్యాంకు సుబ్బయ్య యాదవ్, పొత్తపి నరసింహులు వారి సహకారంతో ఆదివారం 50, 000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.