శ్రీశోభకృత నామ సంవత్సరంలో భద్రాద్రి రామయ్య ఆదాయం 11, వ్యయం 8, సీతమ్మ వారికి ఆదాయం - 2, వ్యయం-11గా ఉందని భద్రాచలం దేవస్థానం అధర్వ వేద పండితులు, ఆస్థాన పురోహితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు తెలిపారు. ఉగాది సందర్భగా రామాలయంలో బుధవారం రాత్రి పంచాంగ శ్రవణం నిర్వహించారు. తొలుత శ్రీసీతారామ చంద్రస్వామి ఉత్సవమూర్తులను నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.