వేసవిలో శరీర ఉష్టోగ్రత పెరుగుతుంది. అందువల్ల తప్పకుండా శరీరానికి చలువ చేసే ఆహారాలను తీసుకోవాలి. కొబ్బరి నీరు, మజ్జిగ క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో వేడి తగ్గడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. రోజూ ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే శరీరంలోని వేడి అంతా తగ్గిపోతుంది. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాడీలోని వేడిని తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.