ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) జాతీయ సమితి పిలుపు మేరకు ఏపీయూడబ్ల్యూజే ఎమ్మిగనూరు తాలూకా కమిటీ అధ్వర్యంలో సేవ్ జర్నలిజం డే ను ఎమ్మిగనూరులో నిర్వహించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌనంగా ప్రదర్శన నిర్వహించారు. గాంధీ , అంబేత్కర్ విగ్రహాలు కు వినతి పత్రాలు సమర్పించారు. గాంధీ విగ్రహం ముందు మోకాళ్ళ పై నిలబడి వినూత్న రీతిలో నిరసన చేశారు. అనంతరం స్థానిక సోమప్ప సర్కిల్ లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపియూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు బీ బజారప్ప, తాలూకా అధ్యక్షులు బీ శ్రీనివాస నాయుడు, పట్టణ అధ్యక్షులు జీబీ పరమేశ్వర, జిల్లా ఉపాధ్యక్షులు భాష, సహాయ కార్యదర్శి నూర్, తాలూకా ప్రధాన కార్యదర్శి చిన్నాకుల నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ వీ రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం ఈరన్న, ఉపాధ్యక్షులు శివ లు మాట్లాడుతూ ఐ జె యూ అదేశాలు మేరకు సేవ్ జర్నలిజం డే చేపట్టినట్లు తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టి , అక్రిడియేషన్, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపియూడబ్లుజే తాలూకా కోశాధికారి అశోక్, పట్టణ కోశాధికారి రవి, తాలూకా సహాయ కార్యదర్శి జగదీష్, మాక్బల్, పట్టణ ఉపాధ్యక్షులు ఆవుల శ్రీనివాసులు, నాయకులు లక్ష్మన్న, యల్లయ్య, ఈరన్న, నాగభూషణం , రాజు, వీరయ్య, అంపయ్య ఆచారి, బాలాజీ , అబ్దుల్లా రహిమాన్ పాల్గొన్నారు.