రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ హాల్లో చిట్వేల్ మండల కన్వీనర్ మరియు ఉప మండల అధ్యక్షులు చెవ్వు శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై చర్చించారు. గురువారం చిట్వేలి మండలంలోని సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి గురించి, రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. వైయస్సార్ పార్టీ ఆవిర్భావం నుంచి చెవ్వు శ్రీనివాసులు రెడ్డి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని చిట్వేలి మండల ప్రజాసమస్యల గురించి, గ్రామాలలో సర్పంచులు మరియు నాయకులు నీళ్లు తోలిన బకాయిలు, ఎఫ్డిఆర్ బిల్స్ గురించి సీఎంతో చర్చించారు. త్వరలోనే నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.