వైయస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వరని గ్రహించి చంద్రబాబుకు అమ్ముడబోయారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర అన్నారు. 4బీ అప్లికేషన్ జీయో ట్యాగ్ చేసే విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లో రోడ్ల నిర్మాణాలు త్వరితగతిన నిర్మిస్తామన్నారు. కాలనీల నిర్మాణాలు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కూడా గౌరవ ప్రదమన్నారు. మా నియోజకవర్గంలో ఇన్ని ఇళ్లు నిర్మించామని శాశ్వతంగా గుర్తుకు ఉండేలా ఉండే కార్యక్రమం. ఇది ఒక యజ్ఞం. ఈ కార్యక్రమంలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు, కోర్టుకు వెళ్లి కేసులు వేశారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని అడ్డుపడిన ఘటనలు మనం చూశాం. చంద్రబాబు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఎక్కడో ఏదో ఎన్నిక జరిగితే..దానికి గుర్తు లేదు. పార్టీ సింబల్ లేదు. ఆ ఎన్నికలో గెలిచి ఏదో సంబరాలు చేసుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.