తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీల జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి మేరుగ నాగార్జున తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.