సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కూడా గొప్ప విషయమన్నారు. జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయన్నారు. 72 ఏళ్ల స్వాతంత్ర భారత దేశ చరిత్రలోనే మూడేళ్ల వైయస్ జగన్ పాలనలో అన్ని ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.