చిట్వేలి మండల పరిధిలో పాత చిట్వేలి నందు మట్లి రాజుల కాలంలో నిర్మితమై ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న వరదరాజస్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాల పునర్ వైభవానికి కృషి చేస్తామని అన్నమయ్య జిల్లా దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, సోమేశ్వర స్వామి, వరదరాజస్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాలను సందర్శించారు. దేవాలయాలు స్థితిగతులపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు మేరకు విచారణ చేపట్టినట్లు తెలియపరిచారు. దేవాలయాల చుట్టూ ఉండే మాడ వీధుల్లో సైతం ఇంటి నిర్మాణాలను చేపట్టినట్లు వాటిని తొలగించేందుకై తహసిల్దార్ తో కలిసి పూర్తిస్థాయిలో సర్వే చేయిస్తామని అన్నారు. ఆలయ భూములు కౌలు తీసుకున్న వారి సమయం ముగియడంతో తిరిగి దండోరా వేయించాలని సిబ్బందికి సూచించారు. ఆలయ భూములను ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. దేవుడి ఆభరణాల అదృశ్యంపై గత నిర్వాహకులను విచారించి నోటీసులు ఇవ్వాల్సిందిగా సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సతీష్ శర్మ, అరవింద్ శర్మ, మణికంఠ, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa