పులివెందుల పట్టణంలోని స్థానిక దివ్యాంగుల నెట్వర్క్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పులివెందుల పట్టణంలోనిఎస్ ఎస్ ఆర్ జనరల్ స్టోర్ యాజమాని శివ తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు బియ్యం తో పాటు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ. జనరల్ స్టోర్ యాజమాని శివ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలే కాకుండా ప్రతి ఏటా తనకొచ్చే ఆదాయంలో కొంత శాతం సమాజంలోని వెనుకబడ్డ అనాధలు, పేదలు, విద్యార్థులు, దివ్యాంగులకు తన వంతు సేవ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ సభ్యులు వెంకటసుబ్బయ్య, సునీల్, గంగయ్య , బషీర్ తదితరులు పాల్గొన్నారు.