ఏపీ ఎండిసి ఉద్యోగులు, కార్మికులకు యూనియన్ అభ్యర్థన మేరకు మంగంపేట బ్రాంచ్ లో రైన్ కోట్లు పంపిణీ చేయడం పట్ల ఏపీ ఎండీసీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు చంద్రశేఖర్ హర్షం ప్రకటించారు. ఓపెన్ మైనింగ్ కాస్ట్ లో వర్షాలకు కార్మికులు ఇబ్బంది పడుతున్నారని మేనేజ్మెంట్ తో అనేకసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగిందని, స్పందించిన మేనేజ్మెంట్ కి, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎండి, వెంకట్ రెడ్డికి, ప్రాజెక్ట్ మేనేజర్ సిపిఓ రమణ కు అభినందనలు తెలిపారు. నైట్ షిఫ్ట్ లో పనిచేసే కార్మికులకి టార్చ్ లైట్లు ఇవ్వాలని కోరారు. మంగంపేట క్యాంటీన్లో గ్రుడ్డు పెట్టాలని, మంగంపేటకు ఎండి వచ్చినప్పుడు యూనియన్ కోరడమైనది, అందుకు ఎండి అంగీకరించి అమలు చేయమని అధికారుల ను ఆదేశించినా నేటికీ అమలు చేయలేదన్నారు. తక్షణం వారానికి నాలుగు రోజులు పౌష్టికాహారం గుడ్డు కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు.