ప్రస్తుతం అనేక మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, స్థూలకాయం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కంటినిండా నిద్రపోయేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతోపాటు సరైన పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. మెగ్నిషియం ద్వారా నిద్రలేమి నుంచి బయటపడవచ్చు. రోజువారిగా పురుషులకు 400 - 420 మిల్లీగ్రాములు, మహిళలకు 310 - 320 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరం.