ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. విశాఖలో జరగనున్న జీ-20 ప్రతినిధుల సమావేశ వివరాలను గవర్నర్ కు తెలియజేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. రేపు విశాఖపట్నంలో జి-20 సమావేశం జరగనుంది. ఈ సదస్సులో దేశ, విదేశీ అతిథులు పాల్గొంటారు. ఇప్పటికే పలువురు విశాఖ చేరుకున్నారు. ఈ సదస్సు కోసం సీఎం జగన్ రేపు విశాఖ వెళ్లనున్నారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటారు.