కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లోక్సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 22లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు పంపింది.ఎంపీగా అనర్హత వేటు పడిన రాహుల్ గాంధీకి ప్రభుత్వ గృహంలో నివసించే అర్హత లేదని లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ సోమవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. రాహుల్ నెలవారీ జీతం, ఇతర అలవెన్సుల్లో కోత పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.