ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు హైకోర్టు తీర్పును అమలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని రాజధాని రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టులో రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.