కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షకు షాక్ తగిలింది. ఇటీవల ఆయన కుమారుడు రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్తకు పట్టుబడ్డాడు. దీంతో కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్డీఎల్) చైర్మన్ పదవికి విరూపాక్ష రాజీనామా చేశారు. ఈ కేసు విచారణకు ఎమ్మెల్యే సహకరించడం లేదంటూ ఆయన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని లోకాయుక్త హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు బెయిల్‌ను రద్దు చేయడంతో ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.