విశాఖ వేదికగా మంగళవారం నుంచి జీ-20 సదస్సు ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొనేందుకు జీ-20లోని 20 సభ్యదేశాలతోపాటు ఆహ్వానిత దేశాలు, 57 మంది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు దాదాపు రూ.120 కోట్లతో నగరంలో అభివృద్ధి, సుందరీకరణ, విద్యుత్ అలంకరణ పనులు చేపట్టారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే థీమ్‌తో రాడిసన్ బ్లూ హోటల్లో నాలుగు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది.