చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది అర్చకులు అమ్మవారిని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. అర్చనలు అభిషేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతం రద్దీతో కిటకిటలాడింది. ఆలయ ఈ ఓ చంద్ర మౌళి ఆధ్వర్యంలో పవిత్ర తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.