తిరుపతి కలెక్టరేట్ వద్ద దళిత క్రిస్టియన్లను ఎస్సీలలో
చేర్చాలని వైసిపి అసెంబ్లీలో చేసిన తీర్మానంపై వ్యతిరేకంగా ఎస్సి మోర్చా నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు సత్యవేడు ముని కృష్ణయ్య మాట్లాడుతూ. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీడి బాలాజీ, తేజోవతి, రమేష్ బాబు, వెంకటయ్య, వాసు, నడంబరం ఆనంద నాయుడు, వెంకటేష్ పాల్గొన్నారు.