ఎస్సీలకు అందరితో సమానంగా మత స్వేచ్ఛ కల్పించండం అభినందనీయమని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా॥ లింగం జాన్ బెన్నీ అన్నారు. సోమవారం స్థానిక నెహ్రుచౌక్ డా॥ బెన్నీ మాట్లాడుతూ మంఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళిత క్రైస్తవుల ఉద్దేశించి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందన్నారు. దళితులు కేవలం చర్చిలకు వెళ్ళటం మాత్రాన వారికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దళిత క్రైస్తవులకు ఎస్సీ హెూదాను కల్పించడం అభినందనీమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏఐసీసీ సెక్రెటర్ ముత్యాల జయరాజు, వైసీపీ నాయకులు వెంపటి సైమన్, లింగం శేఖర్‌బాబు, కంటే జయరాజు, మాచర్ల రాజు, కృపాకర్, ప్రభాకర్, రాంబాబు, పాల్గొన్నారు.