సంజామల మండలం ఆకుమల్ల గ్రామసచివాలయ పరిధిలో మంగళవారం మొబైల్ ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జ్ ఎంపీడీఓ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కొత్తగా ఆధార్ నమోదు చేసుకునే వారు, నమోదు పూర్తి అయి ఆధార్‌కార్డు పొందాలనే వారు కేంద్రంలో సంప్రదించవచ్చన్నారు. ఇంటి చిరునామా, మొబైల్ నంబర్ మార్పు చేసుకునే వారు మొబైల్ ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 29న ముక్కమల్ల గ్రామ సచివాలయ పరిధిలో మొబైల్ ఆధార్ కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.