ముఖ్యమంత్రి జగన్ పాలనలో గంజాయి డ్రగ్స్ వ్యాపారానికి రాష్ట్రం అడ్డాగా మారిందని తెలుగుదేశం పార్టీ సంతనూతలపాడు మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన సంతనూతలపాడు లో పార్టీ కార్యాలయం నందు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒకప్పుడు రాష్ట్రం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు బియ్యం సరఫరా అయితే ఇప్పుడు గంజాయి సరఫరా అవుతుందని అన్నారు. దీంతో యువత పెడదారి పడుతున్నారని హరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు మాఫియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.