నంద్యాల సమీపంలో మార్చి 6న తల్లి పులి నుంచి 4 పులి కూనలు తప్పిపోయి ప్రజలకి కనిపించిన సంగతి తెలిసిందే. ఆ లభ్యమైన ఆ పులి కూనలను స్థానికులు అటవీ అధికారులకు అప్పగించారు. వాటిని తల్లి ఒడికి చేర్చడం కోసం ఫారెస్ట్ అధికారులు ఎంతగానో శ్రమించారు. అడవిలో ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలు పెట్టి మరీ తల్లి ఆచూకీ కోసం ట్రై చేశారు. అయినా తల్లి పులి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఇప్పుడు అధికారుల డౌట్ ఏంటంటే.. నిజంగా పులికూనల తల్లి బతికే ఉందా? లేదంటే వేటగాళ్ల చేతిలో బలైందా? అనేది సందేహాస్పదంగా మారింది. పులికూనల తల్లి పులి టైగర్ -108 గా అధికారులు ప్రకటించారు. పులికూనలను తల్లి వద్దకు చేర్చే ప్రయత్నాలు విఫలం కావడంతో తిరుపతి జూ పార్కుకు తరలించారు. పులి కూనల తల్లి టైగర్ -108యేనా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. పులి వివాదంపై అటవీ అధికారులు మౌనం వహిస్తున్నారు.