ఏపీలో ఎన్నికలపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం అయన మాట్లాడుతూ.. ఏపీలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనసేనతో పొత్తు నిర్ణయం.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలసి తీసుకుంటారని చెప్పారు. పది కోట్లు కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలు పది వేల రూపాయల ఖరీదు కూడా చేయరని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు కొనుగోలుపై వైసీపీ చెత్త ఆరోపణలను బోండా ఉమా ఖండించారు.