చలపల్లి మండలం మంగళాపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఊర చెరువు పూడిక తీత పనులను అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మంగళవారం ప్రారంభించారు. సర్పంచ్ డొక్కు నాగేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ పేరం నాగిరెడ్డి, పంచాయతీ ఈఓ సుబ్బారావు, వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.