మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్యం జరుగుతున్న నిత్య అన్నదానంకు భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు. గతంలో లేనివిధంగా గత కొద్ది నెలల నుంచి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నల్లం సూర్య చక్రధరరావు నిత్య అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి దేవస్థానానికి వచ్చే ప్రతి భక్తుడు మహాప్రసాదంగా భావించే స్వామివారి నిత్యాన్నదానంలో భాగమవుతున్నారు. ప్రతి భక్తుడికి అన్న ప్రసాదం అందే విధంగా చర్యలు తీసుకోవాలని తమ సిబ్బందికి చక్రధరరావు సూచనలు చేశారు. గతంలో అతి తక్కువ మందికి మాత్రమే లిమిటెడ్ గా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించేవారు.