దేశానికి ఆదర్శనీయం ఏపీ సీఎం జగనన్న పాలనని మండల ఎంపీపీ జూటూరు హేమలత, ఎంపీపీ భర్త వైఎస్ఆర్సిపి యువ నాయకులు జూటూరు మారయ్య అన్నారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక లోటు బడ్జెట్ తో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. సీఎం జగనన్నకు రాష్ట్ర ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతుండడంతో ఇది ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన 2024 ఎన్నికలలో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావడం ఖాయమని వారు దీమా వ్యక్తం చేశారు. అలాగే ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం సహకారంతో ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.