నందవరం మండల పరిధిలోని ముగతి గ్రామంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, ఆదేశాల మేరకు బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముగతి ఈరన్న గౌడ్, ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు .ముందు గా తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 1982 మార్చి 28 న ప్రారంభించినప్పటికీ, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి చేశారు నందమూరి తారక రామారావు బలహీన బడుగు బలహీనత వర్గాలు ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో గిర్ని అంజినయ్య ,మాజీ సర్పంచ్ బాలరాజు, గ్రామ అధ్యక్షుడు భార్గవ్ యాదవ్, కొండారెడ్డి, తాయన్న, గుగ్గరి నరసింహులు, దస్తగిరి, మధుసూధన్ రెడ్డి, కాపు వీరారెడ్డి, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ కడబూరి, తులసిరామ్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.