ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మూడు రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ను దాఖలు చేయగా, అమరావతి రైతులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లనూ న్యాయమూర్తి కె.ఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి ఈ కేసును జులై 11 కు వాయిదా వేసింది.