టీడీపీ నేత అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రోజూ ఫోన్లు వస్తున్నాయని, అయితే పార్టీ చర్చించి ఎవరిని చేర్చుకోవాలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలు ఇంకా టచ్లోకి రాలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగింది రహస్య ఓటింగ్ అని.. ఓటింగ్ వివరాలు ఎలా తెలిశాయో సజ్జల చెప్పాలని ప్రశ్నించారు.