కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు విడుదల చేసింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలకు రూ.800 కోట్లు మంజూరు చేసింది. ఈ సంస్థలు 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 7,432 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. ఈ కేంద్రాల్లో బైక్స్, ఫోర్ వీలర్స్, మినీ బస్సులకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.