ఇటీవల రైళ్లపై దాడులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా వందే భారత్ ప్రవేశపెట్టిన తర్వాత దుండగులు ఆ రైలుపై పలు చోట్ల దాడులు చేసి రాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరికలు జారీ చేసింది. రైళ్లపై రాళ్లు విసరడం, ధ్వంసం చేయడం వంటివి చేస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని పేర్కొంది. భువనగిరి, కాజీపేట, ఖమ్మం, రాజమండ్రిలో జనవరి నుంచి ఇప్పటివరకు 39 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్టు పేర్కొంది.