నేపాల్‌లో తలదాచుకున్నాడని అనుమానిస్తున్న ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్.. మార్చి 21వ తేదీన ఢిల్లీ వీధుల్లో కనిపించాడు. కళ్లకు సన్‌గ్లాసులు.. డెనిమ్ జాకెట్‌తో తలపాగా లేకుండా తిరుగుతుండటం సీసీ టీవీలో రికార్డయింది. ఆయన ముఖ్య అనుచరుడు పాపల్‌ప్రీత్ సింగ్ కూడా బ్యాగ్ తో నడుస్తూ కనిపించాడు. వీడియో చిత్రీకరించిన ప్రదేశం ఢిల్లీదేనని నిర్ధారించామని ఓ పోలీసు అధికారి తెలిపినట్టు సమాచారం.