ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసులో మాజీ ఎంపీ, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ తోపాటు మరో ఇద్దరిని యూపీ ప్రయాగ్రాజ్ కోర్టు దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ సహా ఏడుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. మరోవైపు ప్రస్తుతం యూపీ పోలీసుల కస్టడీలో ఉన్న తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ అతిక్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.