అఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌లో బుధవారం ఉదయం 5.49 గంటలకు మరో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలలజీ తెలిపింది. భూకంప కేంద్రం కాబూల్‌కు 85 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. కాగా ఈనెల 27, 22న కూడా అఫ్గనిస్థాన్‌లో భూకంపాలు వచ్చాయి.