వైఎస్ఆర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 31న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సముదాయంలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జరిగే మేళాలో ఫ్లిప్ కార్ట్, ఆల్క్షన్ కంపెనీలు పాల్గొంటున్నాయని, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత హాజరుకావచ్చన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా వెబ్ సైట్ www. ncs. gov. in ను పరిశీలించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa