నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాలతో టిడిపి 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కందుకూరులోని టిడిపి కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, పార్టీ శ్రేణులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలను మొదటిసారిగా అందించింది ఎన్టీఆర్ ప్రభుత్వమేనని నేతలు వివరించారు.