అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ గిరీష ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అధికారులు పోలీసుశా ఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని తనిఖీ కేంద్రాల వద్ద విస్తృతంగా సోదాలు చేపట్టాలన్నారు. ఎంఈవోలు, కళాశాలల ప్రిన్సిపల్స్ లతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేవిధంగా చూడాలని సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఎవరైనా మాదకద్రవ్యాలు తీసుకుని వస్తే వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. గ్రామాల్లో మాదకద్ర వ్యాల వినియోగంపై వీఆర్ఎలు, వీఆర్వోలు సమాచారం అందించేవిధంగా ఆదేశాలివ్వాలని ఆర్డీవోలకు సూచిం చారు. ఏదైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబరు 1908కి కాల్ చేయవచ్చునన్నారు. మాదకద్రవ్యాల నియం త్రణకు జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిం చారు. జిల్లాలో గసాలు, గంజాయి అక్రమ సాగుపై దృష్టి సారించాలన్నారు. 2021 నుంచి 2023, మార్చి వరకు జిల్లాలో 23 కేసులు నమోదు చేసి 150 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. మొత్తం 64 మంది నిందితులతో పాటు 24 మంది విక్రయదారులను గుర్తించి అరెస్టు చేసి నట్లు ఎస్పీ తెలిపారు.