పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో తొలిసారి ఆరుగురు అంధ విద్యార్థినులు డిజిటల్ పద్ధతిలో పరీక్షలు రాయనున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన వీరు పరీక్షల్లో లాప్‌ట్యా్‌పను వినియోగించుకోనున్నారు. సాధారణంగా అంధ, దివ్యాంగ విద్యార్థులు స్ర్కైబ్ సహకారం తీసుకుంటారు. అయితే, సౌమ్య, శ్రీధాత్రి, చైత్రిక, దివ్యశ్రీ, పావని, నాగరత్నమ్మలకు ఎవరి సహకారం లేకుండా.. ఎన్‌వీడీ సాఫ్ట్‌వేర్‌తో పరీక్షలు రాసేందుకు అధికారులు అనుమతించారు. వీరికి నాన్ విజువల్ డెస్క్‌టా్‌ప(ఎన్‌వీడీ) యాక్సెస్ అనే సాఫ్ట్‌వేర్‌తో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ల్యాప్‌టా్‌ప‘కీ’ కోర్డులో లెటర్స్ నొక్కినప్పుడు సౌండ్స్ వస్తాయి. హెడ్‌సెట్ ద్వారా వాటిని విని.. ప్రశ్నలు గుర్తించి, సమాధానాలు రాస్తారు. ఈ విధానంపై ఆర్డీటీ సంస్థ వీరికి ఏడాది పాటు శిక్షణ ఇచ్చింది. దీనిపై విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు.