జిల్లాల విభజన నేపథ్యంలో తూ.గో జిల్లాలో ఒక జిల్లాకు అంబేడ్కర్ కోనసీమ అని పేరు పెట్టడంతో గతంలో అమలాపురంలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. వైసీపీ ఎమ్మెల్యేలు పినిపే విశ్వరూప్, పొన్నాడ సతీశ్ ల ఇళ్లకు కూడా దుండగులు నిప్పుపెట్టారు. దీంతో అప్పట్లో పలువురిపై కేసులు నమోదు కాగా.. ఈ కేసులను ఎత్తివేయాలని సీఎం జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీచేయాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు.