ఓబులవారిపల్లి మండలం గోవిందం పల్లి పంచాయతీలోని పోలివాండ్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్(48) అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఖననం చేశారు. తరువాత బంధువుల మధ్య మాటమాటా పెరిగి వెంకటేష్ కుమారుడే తండ్రిని హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేయడంతో మృతుని సోదరుడు ఓబులవారిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు శవానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత నిజా నిజాలను కనుక్కొని చర్యలు తీసుకుంటామని ఓబులవారిపల్లి పోలీసులు తెలిపారు.