మన శరీరానికి 6 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంది. అతిగా నిద్రపోయినా అనేక సమస్యలకు దారి తీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పి, ఊబకాయం, డయాబెటిస్, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉందని పేర్కొంటున్నారు. అలాగే డిప్రెషన్ తో బాధ పడే వారు నిద్రలేమితో బాధ పడుతుంటారని, అయితే అతి నిద్ర కూడా డిప్రెషన్ కు కూడా కారణమవుతుందని చెబుతున్నారు. అతి నిద్ర వేధిస్తుంటే వైద్యుల్ని సంప్రదించాలి.