అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్‌కు అత్యంత దారుణమైన ముగింపు లభించింది. కడసారి చూపునకు కూడా కన్నతల్లి నిరాకరించడంతో, అతని మృతదేహానికి మున్సిపల్ సిబ్బందే అనాథ శవంలా అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని చెత్త తరలించే ఆటోలో తరలించి దహన సంస్కారాలు పూర్తిచేశారు.చిన్నారిపై ఘాతుకానికి పాల్పడిన కులవర్ధన్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, అతను తప్పించుకుని పారిపోయి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం అతని మృతదేహాన్ని మదనపల్లె ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే, డెడ్‌బాడీని తీసుకెళ్లేందుకు తల్లితో పాటు బంధువులెవరూ ముందుకు రాలేదు. తమకు అతనితో ఎలాంటి సంబంధం లేదని సోదరి తేల్చి చెప్పింది. దీంతో అతని మృతదేహం ఆసుపత్రిలో అనాథలా పడి ఉంది.చివరకు అతని పెదనాన్న ముందుకు వచ్చి సంతకం చేయడంతో, మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. వారు చెత్త తరలించే వాహనంలో మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంతిమ సంస్కారాలు జరిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa