ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్దాన్ని నేనే అపానంటూ మరోసారి వ్యాఖ్యానించిన ట్రంప్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 01:22 PM

భారత్, పాకిస్థాన్ మధ్య 2025లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను తానే చొరవ తీసుకుని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన 'బోర్డ్ ఆఫ్ పీస్' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్థికపరమైన బెదిరింపులతోనే ఇరు దేశాలు యుద్ధం నుంచి వెనక్కి తగ్గాయని ఆయన చెప్పుకొచ్చారు.ఆ సమయంలో భారత్, పాక్ రెండూ యుద్ధానికి సిద్ధమయ్యాయని, తాను ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. "మీరు యుద్ధం ఆపకపోతే మీ ఉత్పత్తులపై 200 శాతం టారిఫ్ (సుంకాలు) విధిస్తాను, మీతో వ్యాపార సంబంధాలు తెంచుకుంటాను అని వార్నింగ్ ఇచ్చాను. డబ్బు నష్టపోతామని తెలియగానే వారు వెనక్కి తగ్గారు. ఎందుకంటే డబ్బు కంటే ఏదీ ముఖ్యం కాదు కదా" అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ ఘర్షణల్లో ఏకంగా 11 యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ ఈసారి కొత్త సంఖ్యను ప్రస్తావించారు. గతంలో ఇదే అంశంపై మాట్లాడుతూ ఆయన 5, 7, 8, 10 అంటూ వేర్వేరు సంఖ్యలు చెప్పడం గమనార్హం. తన జోక్యంతో 2.5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనతో అన్నారని కూడా ట్రంప్ గుర్తుచేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa